ఐపీఎల్‌లో ప్లేయర్ల బదిలీకి రంగం సిద్ధం.. ట్రాన్స్‌ఫర్‌ విండో గురించి పూర్తి వివరాలు..!

-

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 దాదాపుగా సగం వరకు పూర్తయింది. అయితే గతేడాది ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన టీంలు ఈసారి చతికిల పడ్డాయి. ముఖ్యంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఈ సారి అసలు ఏదీ కలసి రావడం లేదు. అయితే చెన్నై సహా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న టీంలు, ఇతర టీంలు కూడా ఇప్పుడు ఐపీఎల్‌ యాజమాన్యం అందిస్తున్న ట్రాన్స్‌ఫర్‌ విండో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ అసలు ప్లేయర్లను టీంలు మార్చుకోవచ్చా, ఐపీఎల్‌ నిబంధనలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎంత మంది ప్లేయర్లు ట్రాన్స్‌ఫర్‌ విండోలో ఉన్నారు ? అంటే…

2019 ఐపీఎల్‌ ఎడిషన్‌లో ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లను మార్చుకునేందుకు ట్రాన్స్‌ఫర్‌ విండో అవకాశం కల్పించారు. ఈసారి కూడా ఐపీఎల్‌ యాజమాన్యం సరిగ్గా అలాంటి అవకాశాన్నే అందిస్తోంది. మంగళవారం నుంచి 5 రోజుల పాటు ట్రాన్స్‌ఫర్‌ విండో యాక్టివ్‌ లో ఉంటుంది. ఆ సమయంలో ఫ్రాంచైజీలు తమ ప్లేయర్లను ఇతర టీంలకు ఇచ్చి, ఇతర టీంలలో ఉండే ప్లేయర్లను తమ జట్టులోకి తీసుకోవచ్చు. అయితే అందుకు ఆ ప్లేయర్‌ సుముఖంగా ఉండాలి. అలా ఉంటే ఐపీఎల్‌కు ఒక నోటీస్‌ ఇచ్చి ఫ్రాంచైజీలు ప్లేయర్లను మార్చుకోవచ్చు. దీంతో ఫ్రాంచైజీలకు అడ్వాంటేజ్‌ ఉంటుంది.

ఇతర టీంలలో ఉన్న ప్లేయర్ల స్కిల్స్‌ తమకు అవసరం అనుకుంటే వారిని ఫ్రాంచైజీలు తీసుకోవచ్చు. దీనికి తోడు ఈసారి ఐపీఎల్‌లో ముఖ్యమైన ప్లేయర్లు గాయాల బారిన పడి దూరమయ్యారు. దీంతో ట్రాన్స్‌ఫర్‌ విండో ద్వారా ఫ్రాంచైజీలకు తమ కావల్సిన స్కిల్స్‌ ఉండే ప్లేయర్లను తీసుకునేందుకు మార్గం ఏర్పడింది. అయితే ఇతర టీంలో ట్రాన్స్‌ఫర్‌ విండోలో ఉన్న ప్లేయర్‌ను తీసుకోవాలంటే ఆ ప్లేయర్‌ ఆ టీంకు 2 మ్యాచ్‌ల కన్నా ఎక్కువ మ్యాచ్‌లను ఆడి ఉండరాదు. 2 లేదా అంతకన్నా తక్కువ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అలాంటి ప్లేయర్లే ట్రాన్స్‌ఫర్‌ విండోలో ఉంటారు. వారినే ఫ్రాంచైజీలు తీసుకోవచ్చు.

ఇక ఈసారి ట్రాన్స్‌ఫర్‌ విండోలో ఉన్న ప్లేయర్ల వివరాలు.. ఫ్రాంచైజీల వారీగా..

* కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ – క్రిస్‌ గేల్‌, మన్‌దీప్‌ సింగ్‌, ఎం.అశ్విన్‌
* ముంబై ఇండియన్స్‌ – నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, ఆదిత్య తారె, మోహ్‌సిన్‌ ఖాన్‌
* చెన్నై సూపర్‌ కింగ్స్‌ – ఇమ్రాన్‌ తాహిర్‌, ఎన్‌.జగదీషన్‌, మిచెల్‌ శాన్టనర్‌
* రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు – గుర్‌కీరత్‌ సింగ్ మన్‌, డేల్‌ స్టెయిన్‌, ఉమేష్‌ యాదవ్‌
* రాజస్థాన్‌ రాయల్స్‌ – మనన్‌ వోహ్రా, యశస్వి జైశ్వాల్‌, వరుణ్‌ అరోణ్‌, ఆండ్రూ టై
* ఢిల్లీ క్యాపిటల్స్‌ – ఆజింక్యా రహానె, ఇషాంత్‌ శర్మ
* సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ – వృద్ధిమాన్‌ సాహా, విజయ్‌ శంకర్‌
* కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ – సందీప్‌ వారియర్‌, టామ్‌ బాంటన్‌, నిఖిల్‌ నాయక్‌

పైన తెలిపిన ఫ్రాంచైజీలు ట్రాన్స్‌ఫర్‌ విండోలో ఉన్న ఆయా ప్లేయర్లను తమ తమ టీంలలోకి తీసుకోవచ్చు. ఉదాహరణకు చెన్నైని తీసుకుంటే అందులో ఉన్న ఎన్‌.జగదీషన్‌, ఇమ్రాన్‌ తాహిర్‌లు చెన్నైకి ఈ సీజన్‌లో ఎక్కువగా ఆడలేదు. దీంతో వారిని ఇతర జట్లు ట్రాన్స్‌ఫర్‌ విండో ద్వారా తీసుకోవచ్చన్నమాట. ఇక తమ టీంలలో ట్రాన్స్‌ఫర్‌ విండోలో ఉన్న ప్లేయర్లను ఇతర జట్లు కోరితే ప్లేయర్ల సుముఖత మేరకు వారిని ఆయా టీంలకు ఇవ్వవచ్చు. మరి ట్రాన్స్‌ఫర్‌ విండో ద్వారా ఏయే జట్లు ఏయే ప్లేయర్లను మార్చుకుంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version