బీహార్ ఎన్నికల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ !.

-

బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. నిజానికి అక్కడ ఇప్పుడు బీజేపీ- జేడీ కూటమి కలిసి పోటీ చేస్తోంది. ఇక ఆర్జేడీ తరపున లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ కూడా గట్టిగానే కష్టపడుతున్నాడు. ఇక మరో పక్క ఎల్జేపీ తరపున మొన్న చనిపోయిన రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్‌ ఫాంలో ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికల్లో జేడీయూ కన్నా తమ పార్టీకే ఎక్కువ స్థానాలు వస్తాయని ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌ అంటున్నారు. నవంబర్‌ 10న ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో అంతిమంగా భాజపా – ఎల్జేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

ఇప్పటివరకు రెండు జాబితాలతో 95 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఎల్జేపీ. ఈయన లెక్క ఇలా ఉంటే బీహార్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత అవసరమైతే చిరాగ్ పాశ్వాన్‌ సహకారం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఎల్‌జేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ ప్రిన్స్‌ రాజ్.. మంగళవారం ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవీ నివాసానికి వెళ్లారు. ఈ సమయంలో తేజస్వి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల ఫలితాల తరవాత మెజార్టీ కొరవడితే, ఆర్జేడీ ఎల్‌జేపీ సహకారం తీసుకోవచ్చని తేజస్వి చెప్పారు. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా మారుతుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news