త్రిపురలో జనవరి నెలలో అసెంబ్లీ జరుగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే జాదాబ్ లాల్ అసభ్యకర వీడియోలు చూస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో జరిగిన ఆ ఘటన గురించి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో అయిదు మంది ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే లు అతనిపై చర్యలు తీసుకోవాలని నిరసనలు తెలిపారు. అయితే సభను నడిపిస్తున్న స్పీకర్ పదే పదే చెప్పినా వినిపించుకోకుండా నిరసన చేస్తుండడంతో ఆగ్రహించిన స్పీకర్ వారిని సభ నుండి సస్పెండ్ చేశారు. తప్పు చేసిన ఎమ్మెల్యే ను సభలో పెట్టుకుని, ఇదేంటి అన్యాయం అని అడిగితే మమ్మల్నే సస్పెండ్ చేశారు అంటూ ఆ అయిదుగురు ఎమ్మెల్యేలు బాధతో చెప్పుకున్నారు. కాగా ఈ విషయంపై స్పీకర్ వ్యవహరించిన తీరు పట్ల ఇతర విపక్ష ఎమ్మెల్యేలు కూడా సభ నుండి బయటకు వెళ్లిపోయారు.
మరి ఇందులో ఎవరిది తప్పు ? సభలో జదాబ్ లాల్ చేసిన పనికి చర్యలు తీసుకోవడంలో స్పీకర్ కు సమస్య ఏమిటి అన్న పలు ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.