ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు. తన సినిమా లు అచ్చ తెలుగు పదాలు తో అందంగా ఉంటాయి. తనతో సమానంగా వుండే దర్శకులు కూడా తనని విపరీతంగా అభిమానిస్తారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు  తో SSMB28 మూవీ చేస్తున్నారు  ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ త్వరలో రెండవ షెడ్యూల్ కి సిద్ధం అవుతోంది.

వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ పై మంచి హైప్ ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురం లో సినిమా వచ్చి వచ్చే సంక్రాంతికి మూడు సంవత్సరాలు అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి ఇంత గ్యాప్ రావడం నమ్మశక్యం గా లేదు. కొవిడ్ వల్ల కొన్ని రోజులు, పెర్ఫెక్ట్ స్క్రిప్ట్ వర్క్ కోసం కొన్ని రోజులు, ఇప్పుడు కృష్ణ గారి మరణం తో కొన్ని రోజులు ఆలస్యం అయ్యింది. ఇది  అస్సలు కోరుకోని గ్యాప్. ఇదే సమయంలో కనీసం రెండు సినిమాలు అయినా పూర్తి అయ్యేవి. ఈ విషయంలో తన సన్నిహితుల వద్ద తన భాదను వెళ్లగక్కుకున్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version