ఓరి దేవుడా..58 గంటలు లిప్ లాక్..వీడియో వైరల్..

-

ముద్దు గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. రొమాన్స్ కు ముందు ముద్దు ముఖ్యమైనది..ఆ తర్వాత మిగితాది అంటున్నారు ప్రేమికులు.. ఒకప్పుడు ముద్దు బూతు.. ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది.ఎవరికైనా మనం ముద్దు ఇచ్చామంటే వాళ్ల మీద మనకున్న ప్రేమను తెలియజేయడం. అయితే ముద్దులో చాలా రకాలు ఉంటాయి.పిల్లలకు బుగ్గ మీద ఇచ్చే ముద్దు వేరు. పెద్దవాళ్లకు ప్రేమతో ఇచ్చే ముద్దు వేరు. పార్టనర్ లకు, భార్యకు, భర్తకు పెదవుల మీద ఇచ్చే ముద్దు వేరు.

సాధారణంగా ఎవరైనా సరే కొన్ని సెకన్ల పాటు మాత్రమే ముద్దు పెట్టుకుంటారు. అంతే కానీ.. గంటలకు గంటలు ఎవ్వరూ ముద్దు పెట్టుకోరు కదా. కొన్ని జంటలు ఏకాంతంగా ఉన్న సమయంలో ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. కానీ.. అది కొంత సేపు మాత్రమే. కానీ.. ఓ జంట మాత్రం ఏకంగా 58 గంటల పాటు ముద్దు పెట్టుకుంది. 58 గంటల పాటు ఏకధాటిగా ముద్దు పెట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని చేసి చూపింది ఆ జంట. అంతే కాదు.. ప్రపంచ రికార్డును కూడా ఆ జంట నెలకొల్పింది. ఈ ఘటన థాయిలాండ్ లోని పట్టాయాలో చోటు చేసుకుంది..

కచాయ్, లక్సన అనే జంట 58 గంటల పాటు ఏకధాటిగా ముద్దు పెట్టుకొని రికార్డు క్రియేట్ చేశారు. చాలా జంటలు ఈ పోటీల్లో పాల్గొన్నప్పటికీ.. చాలామంది మధ్యలోనే తమ వల్ల కాదని వెళ్లిపోయారు. కానీ.. ఒక్క కచాయ్, లక్సన జంట మాత్రమే 58 గంటల పాటు ముద్దు పెట్టుకొని ప్రపంచ రికార్డును క్రియేట్ చేశారు. ఆ జంట ముద్దును గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇది 2013 లో జరిగిందని తెలుస్తుంది.కానీ ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version