‘ఆదిపురుష్’ టీజర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్.. బొమ్మల సినిమానా అంటూ !

-

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న అయోధ్యలో ఈ ఈవెంట్ జరిగింది.  అయితే నిన్న రిలీజ్ అయిన ఆది పురుష్ సినిమా టీజర్ పై కామన్ ప్రేక్షకులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ అవుతున్నారు. ఇది బొమ్మల సినిమానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యానిమేటెడ్ లా ఉందని, వీఎఫ్ఎక్స్ అస్సలు బాగాలేదని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇది నార్మల్ సినిమానా లేదా బొమ్మల సినిమానా అనే సందేహాలు ఉన్నాయంటూ రేంజ్ లో సెటైర్లు పేలుస్తున్నారు ఫాన్స్. అచ్చం రజినీకాంత్ కొచ్చాడియన్ సినిమాల ఉందని చురకలాంటిస్తున్నారు. అటు ప్రభాస్ లుక్ కూడా ఏమాత్రం బాగోలేదని కామెంట్లు పెడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version