అంకుల్ ప్రభాస్ అంటూ ట్రోల్స్..ఫ్యాన్స్ ఆగ్రహం..!

-

బాహుబలి సినిమా తో రెబల్ స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ చూసి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు నెగిటివ్ గా ప్రచారం మొదలెట్టారు. బాలీవుడ్ లో కొత్త హీరోలను ఆహ్వానించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటిది తెలుగు హీరోకు అక్కడ స్టార్ స్టేటస్ రావడం వ జీర్ణించుకోలేక ప్రభాస్ పై చేస్తున్నారని అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఒక ఫోటో పై ట్రాక్స్ ఎక్కువయ్యాయి. ఆదిపురుష్ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ప్రభాస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అందులో ప్రభాస్ కాస్త బరువు పెరిగినట్టు గా కనిపిస్తున్నాడు. అయితే డార్లింగ్ అంకుల్ లా కనిపిస్తున్నాడు అంటూ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ త్రోల్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ఇలా అయిపోయాడు ఏంటి అంటూ ప్రభాస్ గ్లామర్ పై జోకులు వేస్తున్నారు. దాంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు. కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్ లో ప్రభాస్ కంటే ఎక్కువ వయసున్న హీరోలు ఉన్నారు అని కొంతమంది హీరోలు తతల్లా కూడా కనిపిస్తారని కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version