ప్రపంచమంతా అందమైన ప్రకృతి సోయగాల నిలయం. ఎక్కడ చూసినా ఏదో ఒక కొత్త దృశ్యం కనబడుతూనే ఉంటుంది. కొన్ని ప్రదేశాలకు మీరు వెళ్ళలేరు కూడా. ప్రస్తుతం ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో స్థానం సంపాదించిన ప్రకృతి సిద్ధమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
యునెస్కో రూపొందించిన జాబితాలో చోటు చేసుకున్న ప్రకృతి సహజ సిద్ధ ప్రాంతాలు.
గ్రేట్ బారియర్ రీఫ్
ఆస్ట్రేలియాలో ఉన్న ఈ ప్రాంతం పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. సముద్ర ఆవులను ఆవాస ప్రాంతంగా ఉన్న ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.
బైకాల్ సరస్సు
అతి పెద్ద మంచినీటి సరస్సుగా పేరు తెచ్చుకున్న ఈ సరస్సులో అనేక జంతుజాతులు ఆవాసం ఏర్పర్చుకున్నాయి. రష్యాలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా చూడండి.
ఫీనిక్స్ దీవులు
అతిపెద్ద సురక్షిత సముద్ర ప్రాంతమైన ఈ ఫీనిస్ దీవుల్లో సుమారు 800సముద్ర జంతు జాతులు ఉంటాయి.
పపహనమకువెక
హవాయిలో ఉన్న సముద్ర ప్రాంతం చూడదగ్గ ప్రదేశంగా గుర్తింపు పొందింది. నీటిలోపల జీవరాశుల జీవితాన్ని చూడాలనుకునే సాహసికులకు అనువైన ప్రదేశం. హవాయిలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని సందర్శించండి.
తస్లీ ఎన్ అజ్జర్
సహరా ఎడారిలో ఉన్న అల్జీరియన్ నేషనల్ పార్క్ అయిన ఈ ప్రాంతంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అద్భుతమైన గుహల చిత్రాలు ఇక్కడ చూడదగ్గవి. మనిషి పూర్వీకుల దగ్గరకు తీసుకెళ్లే అరుదైన చిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి.
అమెజాన్ సురక్షిత ప్రాంతం
బ్రెజిల్ లో ఉన్న అడవిలో అనేక అందమైన జీవాలతో పాటు ఒళ్ళు గగుర్పొడిచే జీవులు కూడా ఉన్నాయి.