జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో నెగ్గి పీఠాన్ని నిలుపుకోవాలని టీఆర్ెస్ పట్టు మీదుంది. కేసీఆర్ ఫోటో చాలు గెలుపు మాదే అనే ధీమాకు మొన్న వచ్చిన దుబ్బాక ఫలితం గండి కొట్టింది. అది అలా ఉంటే సర్వే రిపోర్టులు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో 99 స్థానాలు చేజిక్కించుకున్న టీఆర్ెస్ కి 60-70 స్థానాలు మాత్రమే పరిమితమవుతుందనేది ఆ సర్వేల సారాంశం. అనధికార మిత్ర పక్షం ఎంఐఎం పరిస్థితి కూడా సీట్లు కోల్పోయేలా ఉంది.
ఈనేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎఐఎం మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తుంది. నగర శివారు ప్రాంతాలను మజ్లిస్ పార్టీ వదులుకోవాలి లేదా అక్కడ బలహీనమైన అభ్యర్థిని పోటీలోకి దించాలి. మొక్కుబడిగా మాత్రమే అభ్యర్థులను నిలబెట్టాలి. ఇక పాతబస్తీలోని కొన్ని స్థానల్లో టీఆర్ెస్ కూడా అదే పని చెయ్యాలన్నది ఒప్పందంగా కనిపిస్తుంది. మరి ఈ రెండు పార్టీలు కోల్పోయే స్థానల్లో ఎవరు గెలుస్తారు..?
కాంగ్రెస్ పుంజుకొని సత్త చాటేంత పరిస్థితి మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. పైగా రేవంతరెడ్డి సన్నిహితుడు అనుచరుడైన కొప్పుల నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ లో చేరారు. బీజేపీ దుబ్బాక ఊపును గ్రేటర్‌లో కొనసాగించేందుకు పావులు కదుపుతుంది. కాంగ్రెస్ పార్టీలోని బలమైన నాయకులను తమవైపునకు తిప్పుకుంటుంది. అంతే కాదు ఇంకో అడుగు ముందుకేసి అధికార టీఆర్ెస్ అసంతృప్తులకూ గాలం వేస్తుందంటూ మీడియా వర్గల మాట.
ఇక టీఆర్ెస్, ఎంఐఎంల అంతర్గత ఒప్పందాన్ని ఇరు పార్టీ కార్యకర్తలు అంగీకరించేందుకు సిద్ధంగా లేనట్లు వినవస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల బరిలోకి దిగుతున్న ఎంఐఎం పార్టీ గ్రేటర్ ఎన్నికల కోసం కేవలం పాతబస్తీకే పరిమితమవడం ఏంటంటూ అసంతృప్తి వెల్లగక్కుతున్నారు క్రింది స్థాయి నాయకులు. ఇక ఈ గ్రేటర్ ఒప్పందం వల్ల తమకేమి ఒదిగేది లేదని, గతంలో కూడా తమను పట్టించుకున్నది కూడా లేదంటూ బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా టీఆర్ెస్ వలలో చిక్కితే తమ బలాన్ని తామే తగ్గించుకన్నవాళ్లమవుతామంటున్నారు.
ఆఖరికి కాంగ్రెస్ బలపడినా పరవాలేదు కానీ బీజేపీ మాత్రం రాకూడదన్నది రెండు పార్టీల బావన కూడా కావొచ్చు.
ఏది ఏమైనా టీఆర్ెస్ గ్రేటర్ పీఠం దక్కించుకుంటుంది కానీ స్థానాలు మాత్రం తగ్గుతాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇక్కడ టీఆర్ెస్‌కి వచ్చే ప్రమాదం మాత్రం బీజేపీ.. మెల్లి మెల్లిగా ప్రజల్లోకి లోతుగా పాతుకుపోతోంది. నిదర్శనం మళ్లీ చెప్పాలా..? అధికార పార్టీ కంచుకోట.. అటు కేసీఆర్, ఇటు కేటీఆర్, మరోవైపు హరీష్ ల నియోజకవర్గాల మధ్యలో పాగ వేసింది కదా..
-RK