‘కారు’ వ్యూహం: బాబు మాదిరిగా రేవంత్‌ని బుక్ చేస్తున్నారా?

-

తెలంగాణకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో….ఆ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. అలాగే తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు ఎలాంటి కృషి చేశారో కూడా తెలిసిందే. కానీ ఎంత చేసిన ఒక్క తెలంగాణ ఉద్యమం దెబ్బకు చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ అయ్యారు. ఉద్యమ సమయంలో బాబు డబుల్ స్టాండ్ తీసుకోవడం టి‌డి‌పికి బాగా ఇబ్బంది అయింది. నాకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళు అంటూ బాబు మాట్లాడటమే పెద్ద మైనస్ అయింది. తెలంగాణకు మద్ధతు ఇస్తే ఏపీలో ఇబ్బంది అవుతుందని చెప్పి రెండు కళ్ల సిద్ధాంతం పాటిస్తూ వచ్చారు.

TRS-Party | టీఆర్ఎస్

ఇదే క్రమంలో తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడంతో చివరికి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. అయినా సరే తెలంగాణలో చంద్రబాబుకు జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. వైఎస్సార్ చనిపోవడంతో టి‌ఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా చంద్రబాబు కనిపించారు. దీంతో ఉద్యమ సమయంలో బాబుని గట్టిగా ఇరుకున పెట్టారు. ఇక బాబు రెండు కళ్ల సిద్ధాంతం వల్ల తెలంగాణలో టి‌డి‌పి బాగా డ్యామేజ్ జరిగింది.

అక్కడ నుంచే పార్టీ కనుమరుగవ్వడం మొదలైంది. పైగా 2014లో ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉండటం, ఇటు తెలంగాణలో కే‌సి‌ఆర్ అధికారంలో ఉండటంతో…ఇద్దరి మధ్య పెద్ద వార్ జరిగింది. ఈ క్రమంలోనే బాబు తెలంగాణ ద్రోహి అని ముద్రపడటంతో తెలంగాణలో టి‌డి‌పి పూర్తిగా నష్టపోయింది. ఇక 2018 ఎన్నికల్లో కూడా బాబుని బూచిగా చూపే టి‌ఆర్‌ఎస్ మళ్ళీ గెలిచింది.

అయితే ఇప్పుడు టి‌ఆర్‌ఎస్…టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఎలాగో రేవంత్, బాబు మనిషి అని ప్రచారం చేస్తున్నారు. పైగా ఉద్యమ సమయంలో చంద్రబాబు పక్కన ఉండి ఉద్యమకారులపై దాడుల చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాదా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ మొదట ద్రోహి రేవంత్ అని విమర్శిస్తున్నారు. అంటే బాబు మాదిరిగానే రేవంత్‌పై కూడా తెలంగాణ ద్రోహి అని ముద్రవేసి టి‌ఆర్‌ఎస్ మళ్ళీ బెనిఫిట్ పొందాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ అన్నివేళలా ఒకే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version