బీజేపీని తరిమికొట్టే రోజులు వస్తాయి.- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

-

రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. వరి ధాన్యాన్నికొనుగోలు చేయాలన డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తున్నారు. స్వయంగా మంత్రుల ధర్నాల్లో పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి మొదలగు మంత్రులు వారివారి జిల్లాల్లో ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపై ఎర్రబెల్లి విరుచుకుపడ్డారు. ఎఫ్సీఐ ద్వారా కేంద్రం ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేసే దాకా వదిలిపెట్టం అని హెచ్చిరించారు. రాబోయే రోజుల్లో బీజేపీ సర్కార్ ను ప్రజలు తరిమికొట్టే రోజులు వస్తాయని హెచ్చిరించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారన్నారు ఆయన. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version