తెలంగాణలో మరోసారి మావోలు అలజడి కలకలం రేపుతుంది..గత కొద్ది రోజులుగా తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న అణచివేత ప్రయత్నాలకు సవాల్ విరుసుతున్నారు. తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాకలో మావోయిస్టులకు వ్యతిరకంగా పని చేస్తున్నారని టీఆర్ఎస్ నేత భీమేశ్వర్‌ను అతి కిరాతకంగా హత్యచేశారు..అర్థరాత్రివేళ భీమేశ్వర్ ఇంటికి వచ్చిన మావోయిస్టులు ఆయన్ని బయటకురమ్మన్నారు..బయటకు రాకుండా భీమేశ్వర్ డోర్ తియ్యలేదు. దాంతో మావోయిస్టులు డోర్‌పై కాల్పులు జరిపారు..కాల్పులకు భయపడి నిద్రమత్తులోనే ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత మావోయిస్టులు ఆయన్ని దారుణంగా కత్తులతో పొడిచారు..హత్య చేసిన ఘటనా స్థలంలో మావోయిస్టులు లేఖ వదిలి వెళ్లారు..ఈ హత్య ఎవరు చేశారో అని పోలీసులు ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం లేదంటూ…తామే హత్య చేసినట్లుగా లేఖలో పేర్కోన్నారు మావోలు..టీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు..అధికార పార్టీలో ఉంటూ ప్రజలను దోచుకుంటున్నారని లేఖలో ఫైర్ అయ్యారు. తాము చెప్పినట్లు రాజీనామా చేయకపోతే..వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు..గత కొన్ని రోజులుగా మావోయిస్టులపై కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాల నిఘా పెంచింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీస్ విభాగాలకు సహకరించడానికి బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మావోయిస్టులు తాజా ఘాతుకానికి పాల్పడ్డారు.
బ్రేకింగ్: ములుగులో మావోయిస్టుల ఘాతుకం..టీఆర్ఎస్ నేత దారుణ హత్య.
-