టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో మరో వివాదం నెలకొంది. ఇప్పటికే ”మా” అధ్య క్ష ఎన్నికల కారణంగా టాలీవుడ్ నటీ, నటుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యం లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో మరో వివాదం తెర పైకి వచ్చింది. టాలీవుడ్ చిత్రాలైన టక్ జగదీష్ మరియు లవ్ స్టోరీ సినిమా ల మధ్య తాజాగా కొత్త వివాదం నెలకొంది. సెప్టెంబర్ మాసం 10 వ తేదీన ఓటీటీ ప్లాట్ ఫామ్ లో నాని హీరో నటించిన టక్ జగదీష్ సినిమా విడుదల కానుండగా… అదే రోజున నాగ చైతన్య హీరోగా చేసిన లవ్ స్టోరీ సినిమా అన్ని థియేటర్లలో విడుదల కానుంది.
దీంతో ఓటీటీ ల్లో క్రేజీ ప్రాజెక్టుల విడుదల పై థియేటర్ ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లకు మద్దతివ్వకుడా ఓటీటీలను ఆశ్రయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తున్న నిర్మాతలపై ఎగ్జిబిటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అటు హీరో నాని కూడా టక్ జగదీష్ నిర్మాణ సంస్థ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టక్ జగదీష్ సినిమా ను ఓటీటీ లో రిలీజ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. థియేటర్ల లో సినిమా విడుదలకే తాను ఇష్టపడతానని పేర్కొన్నారు నాని.