నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక్కడ ప్రస్తుతానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యత కనబరుస్తున్నారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య నెలకొని ఉందని చెబుతున్నారు. బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడంతో నామమాత్రపు ఓట్లు మాత్రమే ఆయనకు లభించాయి. ఇక ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్, కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవి కుమార్ యాదవ్ బరిలోకి దిగారు.
టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఈ ఎన్నికలు జరిగాయి. అయితే టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారం మొదలు తండ్రి చనిపోయాడనే సింపతీ కూడా వర్కవుట్ అయ్యి ఉండవచ్చు అనే వాదన వినిపిస్తోంది. మరి సాయంత్రానికి తుది ఫలితాలు వెలువడే నాటికి ఎవరు గెలుస్తారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొదటి రౌండ్లో టిఆర్ఎస్ 4228, కాంగ్రెస్ 2753 ఓట్లు లభించాయి.