అసెంబ్లీ సీట్లను పెంచాల్సిందే – అమిత్ షా కు టిఆర్ఎస్ లేఖ

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాత అంటే.. 1931 సంవత్సరం తరువాతే అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయం అన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వినోద్ కుమార్ తీవ్ర నిరసన తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లను పెంచాలన్ డిమాండ్ చేస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ రాశారు.

పార్లమెంటు ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచాలి.. ” ఒకే దేశం – ఒకే చట్టం ” బీజేపీ నినాదం అర్థం ఇదేనా…? అని నిలదీశారు. జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచిన విధంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version