తెలంగాణా మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక సమావేశంలో మాట్లాడుతూ కమలాకర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై మాట్లాడిన మంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేసారు. కేటిఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారని గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.
మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించుకున్నామని ఆయన హర్షం వ్యక్తం చేసారు. సిఎం కెసిఆర్, మంత్రి కేటిఆర్ పని తీరు చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి వ్యాఖ్యానించారు. రాబోయే 40 ఏళ్ళు తెలంగాణాలో తెరాసదే అధికారం అంటూ కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక ఈ సందర్భంగా ఆయన మరో ఆసక్తికర వ్యాఖ్య చేసారు. దేశం అంతా కెసిఆర్ ప్రధాని కావాలని కోరుకుంటుంది అన్నారు.
దేశం అభివృద్ధి చెందాలి అంటే కెసిఆర్ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో కేటిఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. కాగా తెలంగాణాలో కేటిఆర్ ముఖ్యమంత్రి అవుతారు అనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ వాదనకు మరింత బలం చేకూరింది. ఈ ఏడాది ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అంటున్నారు.