తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలు వస్తాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… కూడా ప్రతి సారి తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతూనే ఉన్నారు. కెసిఆర్ తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. అయితే ముందస్తు ఎన్నికలపై తాజాగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే నోరు జారారు.
అయితే తాజాగా టిఆర్ఎస్ పార్టీ నేత అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తెలంగాణ ముందస్తు ఎన్నికల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయని… సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నిధులపై కేంద్రంతో సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే దళిత బంధువుడు ముందుగా టిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చి కుంటామని నోరు జారారు ఎమ్మెల్యే అబ్రహం. తర్వాత మిగిలిన లబ్ధిదారులకు ఇస్తామని పేర్కొన్నారు.