బీజేపీ కార్యాలయంపై దాడి.. స్పందించిన టీపీసీసీ అధ్యక్షులు..!

-

ఈరోజు ఉదయం బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ లిడార్ రమేష్ ప్రియాంక గాంధీ పైన చేసిన అభ్యంతారకరామైన కామెంట్స్ కు నిరసనగా ఈ దాడి చేయగా.. బీజేపీ నాయకులు అందరూ ఈ దాడికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత వహించాలని కామెంట్స్ చేసారు.

ఈ సందర్భంగా తాజాగా ఈ దాడిపై రియాక్ట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన ఉండాలి.. ప్రియాంక గాంధీ పై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవే. కానీ యూత్ కాంగ్రెస్ ఇలా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపైన దాడికి వెళ్లడం సరైంది కాదు. ఈ క్రమంలో యూత్ నేతలకు వార్నింగ్ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్.. ఆ యూత్ నేతలను పిలిచి మందలించనున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా ఇలా దాడులు చేయడం సరైంది కాదు అన్నారు. బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్న.. ప్రజాస్వామ్యం లో దాడులు పద్ధతి కాదు. శాంతి భద్రతల విషయంలో బీజేపీ నాయకులు సహకరించాలి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version