అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏమిటి..?, ఎందుకు జరుపుకోవాలి..?

-

ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటూ ఉంటాము. అయితే ఎందుకు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి..?, అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏమిటి వంటి ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 108 సంవత్సరాల నాటి గొప్ప చరిత్ర కలిగి ఉంది.

మొదట 1908 సంవత్సరంలో మహిళలు తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ లో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. అయితే ఈ డిమాండ్లను వెంటనే దృష్టి లో పెట్టుకుని 1909వ సంవత్సరంలో అమెరికా లోని సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. 1911లో ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలి సారిగా జరిపారు.

రష్యాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1913లో చేశారు. ఆ రోజు సెలవు దినంగా కూడా ప్రకటించారు. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం శాంతి కోసం డిమాండ్ చేశారు. అయితే అది ఆదివారం అయింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం.

గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అయితే మార్చి 8. దీని మూలంగానే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా ప్రకటించారు. 1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది.

ఇప్పటికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మహిళల విజయాలను గౌరవించడానికి అంకితం చేసే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆరోజు విభిన్న నేపథ్యాలు, సంస్కృతుల మహిళలు అంతా ఒక్కటిగా కలిసి మహిళల హక్కుల కోసం పోరాడతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version