టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియకు కరోనా

-

ఖమ్మం: ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు కరోనా పాజిటివ్ వచ్చింది. రెండ్రోజులుగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జలుబు, జ్వరం లక్షణాలు రావడంతో ఆమె పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె చికిత్స పొందుతున్నారు. హోమ్ ఐసోలేషన్‌లోనే డాక్టర్ల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తనతో పాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా తగ్గుముఖం పట్టినా ప్రతి ఒక్కరూ మాస్కులు కచ్చితంగా ధరించాలని పిలుపు నిచ్చారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలోనే నేతలు, కార్యకర్తలు భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version