రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌంటర్… మేం చెప్పులతో కొడతాం..!

-

కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టండి అని రేవంత్ రెడ్డి కామెంట్స్ పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అని… రాజ్యాంగేతర శక్తిగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని ఫైర్‌ అయ్యారు.

మేము సేవా రాజకీయాల్లో ఉన్నామని… గతం లో రాజీనామా చేసి, స్పీకర్ కు రాజీనామా ఇవ్వలేదు ఎందుకు..? అని ప్రశ్నించారు. తామపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. రాళ్లతో కాదు… మేం చెప్పులతో కొడతామని రేవంత్‌ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. ఓటుకు నోటుకు కేసులో రేవంత్ దొరికాడని…దీనిపై కాంగ్రెస్ లోని సీనియర్లే రోధిస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ లో టికెట్లు మాత్రమే కాదు.. పదవులు కూడా అమ్ముకుంటున్నారని చురకలు అంటించారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జి ఠాకూర్ కు రేవంత్‌ రెడ్డి ఏకంగా రూ. 25 కోట్లు ఇచ్చి పిసిసి తెచ్చుకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు సుధీర్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version