జై శ్రీరామ్ వద్దు… జై కేసీఆర్ అనాలి : దళితులకు తాటికొండ రాజయ్య పిలుపు

-

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి. రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్ అంటే దళితులు బాగుపడరు… జై దళిత, జై కేసీఆర్ అంటే దళితులు బాగు పడుతారంటూ పేర్కొన్నారు రాజయ్య. బీజేపీ హయాంలో దళితుల కొరకు ఒక్క పధకమైన ప్రవేశపెట్టారా, రిజర్వేషన్లు పెంచారా అని నిలదీశారు. బ్రతుకు దెరువు కొరకు ఎక్కడో పోయి, దళిత నియోజకవర్గం లో పోటీ చేయడానికి వచ్చారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

1994 నుండి నేను గెలిచే వరకు రాజయ్య మనుషులు అని నా ఫాలోవర్స్‌ ను ఇబ్బంది పెట్టారన్నారు. నా అక్క చెల్లెల్లు, తో బుట్టువులు ఇప్పటికి కంట్రోల్ బియ్యం తింటున్నారు మా కుటుంబంలో అందరు పేదవాళ్లే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

నేను ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయనని.. నా విజయాలు చెప్పి వచ్చే ఎలక్షన్ లో పోటీ చేస్తానని ప్రకటన చేశారు. నా పై కారు కూతలు కూసే వారు జాగ్రత్త, ఊరికిచ్చి కొట్టె సమయం వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడున్న 100 మంది దళిత లబ్దిదారులను 100 పులులుగా చేస్తా, నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. TRS ప్రభుత్వం మానిఫెస్టోలో పెట్టిన విధంగానే సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version