రాజకీయ నాయకులకూ దళిత బంధు ఇవ్వాల్సిందే : టి. రాజయ్య

-

దళిత బంధు బంధు ప్రీతి ఆరోపణలపైన స్పందించారు ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య. తాటికొండ వంశంలో పేదలు ఉండరా…ప్రజాప్రతినిధులు దళిత బందుకు అనర్హులా.. అని ప్రశ్నించారు. పేద ప్రజా ప్రతినిధులకూ దళిత బంధు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. తాటికొండ రాజయ్య కుటుంబంలో పేదలు కూడా ఉన్నారని… దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో ఎక్కడ తప్పులు చేయలేదని పేర్కొన్నారు.

జిల్లా మంత్రి దయాకర్ రావు గారి సూచన మేరకు సెలెక్ట్ చేశామని… రాజకీయ నాయకులు లబ్దిదారులు కాదా ? నియోజకవర్గ దళితులు అందరూ కూడా నాకు బంధువులేనని చెప్పారు. సీఎం కేసీర్ గారు అంబేద్కర్ ఆలోచలకు దిక్ సూచిగా దళిత బంధు ప్రవేశపెట్టారని… దళితులు ఆర్ధికంగా, సామాజికంగా ఎదగాలని దళిత బంధు ప్రవేశపెట్టారని తెలిపారు.

భూమిలేని నిరుపేద నుండి ఉద్యోగస్తుడిని కూడా ఆదుకోవాలని, కేసీఆర్ సూచన మేరకు నియోజకవర్గం నకు 100 మందిని సెలెక్ట్ చేశామని వెల్లడించారు. అత్యధికంగా SC జనాభా కలిగిన మరియు 44 సంవత్సరాల నుండి SC రిజర్వేషన్ ఉన్న ఏకైక నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ అని తెలిపారు. రాజకీయ లబ్ది కోసం దళిత బంధు ను తీసుకురాలేదని.. నియోజకవర్గంలో దళితుల అభివృద్ధి ధ్యేయమన్నారు. నా అక్క చెల్లెల్లు, తో బుట్టువులు ఇప్పటికి కంట్రోల్ బియ్యం తింటున్నారు మా కుటుంబంలో అందరు పేదవాళ్లే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version