తమ నియోజకవర్గం లో వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రైస్ మిల్లు యాజమాన్యాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. అంతే కాకుండా ధాన్యం లోడు ఉన్న లారీని తీసుకుని డైరెక్ట్ గా జిల్లా కలెక్టర్ కార్యాలయాని కే వచ్చేసాడు. దీంతో అధికారులు, అక్కడ ఉన్న జనం, పోలీసులు ఆశ్చర్య పోయారు. గత నాలుగు రోజుల నుంచి రైస్ మిల్ యజమానులు వరి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించాడు.
జిల్లా లో రైస్ మిల్ యజమానులు వరి ధాన్యం కొనుగోలు చేయక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. అలాగే తమ ప్రభుత్వం వాన కాలం కు సంబంధించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. కానీ రైస్ మిల్ యజమానులు వల్లే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నే నిలిచి ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యాప్తం గా మిగిలిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకుంటే.. రైస్ మిల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.