సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా నటించిన సినిమా పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కు రెండొ భాగం కూడా తీస్తున్నారు. దీనికి మొదటి పార్ట్ కంటే రెండు రెట్లు ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారట. అలాగే మొదటి భాగం కంటే అధ్బుతమైన లొకేషన్స్ లో షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ వర్క్ కోసం సుకుమార్ ఏకంగా 6 నెలలు టైమ్ కేటాయించారు. దీన్ని బట్టి ఈ సినిమాను వారు ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలుస్తోంది.
ప్ర
దీని కోసం నిజమైన సింహాల తో షూటింగ్ చేసుకోవడం కోసం అనుమతి ఇచ్చే దేశాలలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సింహం తో ఫైట్ అంటే మళ్లీ జూ ఎన్టీఆర్ RRR ఫైట్ గుర్తుకు రాకుండా దానిని మించి పోయేలా వుండాలని ఫైట్ మాస్టర్ లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం వస్తోంది. ఈ విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.