రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. అయితే… నిన్నటి లాగే… లోక్ సభ, రాజ్య సభల్లో…. ప్రతి పక్ష నేతలు… కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే… రాజ్యసభ నుంచి టిఆర్ఎస్ పార్టీ ఎంపీల వాకౌట్ అయ్యారు. నిన్న12 మంది రాజ్యసభ సభ్యులపై వేసిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని… డిమాండ్ చేస్తూ… రాజ్యసభ చైర్మన్ ను కోరాయి విపక్షాలు. అయితే…దీనికి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అంగీకరించక పోవడంతో రాజ్యసభ నుంచి వాకౌట్ అయ్యారు విపక్ష పార్టీల ఎంపీలు.
ఇందులో టీఆర్‌ఎస్ పార్టీ రాజ్య సభ సభ్యులు కూడా ఉండటం గమనార్హం. రాజ్యసభ నుంచి వాకౌట్ అయిన అనంతరం పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట విపక్ష ఎంపీల ఆందోళన చేస్తున్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని… మండిపడుతున్నారు నేతలు. ఇక అటు లోక్‌సభలో రెండో రోజూ గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి.. వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్షాల పట్టు పట్టాయి. అయితే.. సభ సజావుగా సాగే పరిస్థితి లేకపోవడంతో లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్.