BREAKING : యాదాద్రిలో బూర నర్సయ్య గౌడ్‌ను అడ్డుకున్న గ్రామస్థులు..వీడియో వైరల్

-

BREAKING : బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్‌ కు టీఆర్ఎస్‌ నుంచి నిరసన సెగ తగిలింది. కాసేపటి క్రితమే… యాదాద్రిలో బూర నర్సయ్య గౌడ్‌ ని టీఆర్ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. బూర నర్సయ్య గౌడ్‌ డౌన్‌డౌన్‌ అంటూ ఈ సందర్భంగా టీఆర్ఎస్‌ పార్టీ నేతలు నినాదాలు చేశారు.

దీంతో చౌటుప్పల్‌ మండలం జే కేసర్‌లో బీజేపీ-టీఆర్ఎస్‌ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితి చక్కదిద్దారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఇటీవలే టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి… బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు బూర నర్సయ్య గౌడ్‌. ఇక బూర నర్సయ్య గౌడ్‌ బీజేపీలోకి చేరగానే.. ఆ పార్టీ నుంచి స్వామిగౌడ్‌, దాసోజు టీఆర్‌ఎస్‌ లోకి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version