చాలామంది శని, ఆదివారాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. శనివారం కోసం గురువారం నుంచే ఎదురుచూస్తాం. వీకెండ్ వచ్చిందంటే.. అదేదో స్వతంత్రం మళ్లీ వచ్చిందా అన్నట్లు ఫీల్ అవుతాం.. అటు ఉద్యోగాలు చేసేవారికి, ఇటు వ్యాపారాలు చేసేవారికి, స్కూళ్లకు వెళ్లేవారికి అందరికీ శని, ఆదివారం అంటే ఇష్టం ఉంటుంది. ఆ రెండు రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ సోమవారం ఎవరి పనులకు వాళ్లు వెళ్తారు.. దాంతో.. మళ్లీ మామూలేనా అని సోమవారాన్ని చాలా కష్టంగా స్టాట్ చేస్తారు. వారంలోనే వరస్ట్ డేగా సోమవారం అని మనం ఫీల్ అవుతాం.. ఇప్పుడు అదే విషయం గిన్నిస్ రికార్డుకు కూడా ఎక్కేసింది.
అత్యంత చెత్త రోజుగా ‘సోమవారం’ గిన్నిస్ రికార్డు.
.తాజాగా ఇదే అంశంపై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఓ సర్వే నిర్వహించారు. ఇందులో ఆయా వారాల్లో జనాలు ఎలా ఫీలవుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఒక్కో రోజు ఒకలా ఫీలవుతున్నట్లు తెలిసింది. చాలా మంది నుంచి వచ్చిన సమాధానం ఒక్కటే. ఏంటంటే.. వారంలో అత్యంత చెత్త రోజు సోమవారం. ఈ నేపథ్యంలో సోమవారాన్ని వారంలో అత్యంత చెత్త రోజుగా గుర్తించారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్ అత్యంత చెత్తవారంగా సోమవారానికి చోటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. “వారంలో అత్యంత చెత్త రోజు రికార్డును సోమవారానికి అధికారికంగా అందిస్తున్నాము” అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించింది.
భిన్న అభిప్రాయాలు..
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోమవారాన్ని చెత్త రోజుగా ప్రకటించడం పట్ల నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్‌కి ఇప్పటి వరకు 4.28 లక్షలకు పైగా లైక్‌లు, 79,000 రీ ట్వీట్లు వచ్చాయి. కొందరు ఫన్నీగా స్పందిస్తుంటే..మరికొందరు అలా ఎలా చెప్తారు.. సోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆరోజు ఏదైనా కొత్తపని స్టాట్ చేస్తాం..అంటూ ఇంకొందరు అంటున్నారు. ఇంతకీ మీరు ఏం ఫీల్ అవుతున్నారు..? మీరు కూడా వరస్ట్ డే ఆఫ్ ది డేగా సోమవారాన్నే ఎంచుకుంటారా..?