హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక షాక్ నుంచి బయటపడక ముందే అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అయిన నేపథ్యంలో టిఆర్ఎస్ తలపెట్టిన విజయ గర్జన సభ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. కెసిఆర్ దీక్షా దివస్ ఈ సందర్భంగా వరంగల్ నగర పరిధిలో దేవన్నపేట శివారులో విజయ గర్జన సభను నిర్వహించేందుకు టిఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఈనెల 29న సుమారు 10 నుంచి 12 లక్షల మందిని సమీకరించి భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టిఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
అయితే టీఆర్ఎస్ ప్లీనరీ బహిరంగ సభ కు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి మారనుందని తెలుస్తోంది.. వరంగల్ జిల్లాలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యం లో టీఆర్ఎస్ ప్లీనరీ బహిరంగ సభ వాయిదా పడే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై ఇవాళ సాయంత్రం లోగీ క్లారిటీ ఇవ్వనుంది ఈసీ..