కేసీఆర్ లంకను కూల్చుతాం.. రామ రాజ్యం ఏర్పాటు చేస్తాం: తరుణ్ చుగ్

-

తెలంగాణ రాష్ట్ర సిఎం కేసీఆర్ లంక ను కూల్చుతమని.. రామ రాజ్యం ఏర్పాటు చేస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం ఉందని కేసీఆర్ గుర్తించుకోవాలని హెచ్చరించారు తరుణ్ చుగ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

హుజురాబాద్ ఎన్నిక ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుందని సిఎం కేసడీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు తరుణ్ చుగ్. ఆలీ బాబా 40 దొంగలు మాదిరి కేసీఆర్ క్యాబినెట్ రాష్ట్రాన్ని దోచుకుంటోందని నిప్పులు చెరిగారు.

మోదీ ఆశీర్వాదం తో తెలంగాణ లో రామ రాజ్యం రాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు తరుణ్ చుగ్. కేసీఆర్ కుటుంబం‌ సంపాదించిన ప్రతి రూపాయి ప్రజలదేనని ఆరోపణలు చేశారు. కేసీఆర్ అహంకారంతో పరిపాలన చేస్తున్నాడని మండిపడ్డారు తరుణ్ చుగ్. కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ అస్సలు భయపడేది లేదని పేర్కొన్నారు తరుణ్ చుగ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version