కేటిఆర్ దెబ్బకు విపక్షాల అబ్బ…!

-

తెలంగాణా మున్సిపల్ ఎన్నికలో తెరాస విపక్షాలకు చుక్కలు చూపించింది. తనను ఇబ్బంది పెట్టి అధికారంలోకి రావాలని భావించిన భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి కెసిఆర్ తన రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో చూపించారు. దాదాపు అన్ని మున్సిపాలిటీలు కూడా తెరాస పార్టీ భారీ అధిక్యాలతో విజయాలను నమోదు చేసుకుంది. మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా సత్తా చాటి౦ది.

దీనితో ఇప్పుడు మంత్రి కేటిఆర్ పేరు మారు మోగిపోతుంది. మున్సిపల్ ఎన్నికల ముందు నుంచి కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన కేటిఆర్, విపక్షాలను ఇరుకున పెట్టె విధంగా ప్రసంగాలు చేసారు. కేటిఆర్ వ్యాఖ్యలకు బిజెపి, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్ళింది. అభ్యర్ధుల ఎంపిక నుంచి అసమ్మతుల బుజ్జగింపు వరకు కూడా కేటిఆర్ ఏ రాజకీయం చేసారు అనేది వాస్తవం.

అభ్యర్ధుల తరుపున ఆయన చేసిన ప్రచారం కూడా హైలెట్ గా నిలిచింది. రెబల్స్ వెనక్కు తగ్గడంలో కూడా కేటిఆర్ వ్యూహాలు ఫలించాయి. మళ్ళీ పార్టీలోకి వస్తామన్నా సరే తీసుకునే పరిస్థితి లేదని, నాతో ఉంటే నా వాడిగా చూసుకుంటా అంటూ కేటిఆర్ స్పష్టంగా చెప్పారు. దీనితో రెబల్స్ ని అడ్డం పెట్టుకుందామని భావించిన కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు కేటిఆర్ దారులు మూసేశారు.

ఎన్నికల నిర్వహణలో సోషల్ మీడియాను కూడా విశేషంగా వాడుకున్నారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశమై వారికి మార్గ నిర్దేశం చేసారు. మీతో నేను ఉంటా అంటూ కేటిఆర్ వారికి అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు. దీనితో ఎన్నికల నిర్వహణ అనేది తెరాస సమర్ధవంతంగా చేయగలిగింది. ఓటర్ బూత్ కి వెళ్ళాలి అనే సిద్దాంతం తెరాస పార్టీకి నేడు భారీ విజయాన్ని అందించింది అనేది వాస్తవం.

Read more RELATED
Recommended to you

Latest news