మన ఇండియా సోషల్ మీడియాలో కరోనా వైరస్ ఎంత సిల్లీగా ఉందో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కూడా దాదాపు అది అలాగే ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆయన గారికి అది ఒక కామెడి అనేది ముందు నుంచి అర్ధమవుతూనే ఉంది. మానవత్వపు పాళ్ళు చాలా తక్కువ అనే విషయం చాలా సందర్భాల్లో వ్యక్తమైంది. తాజాగా ఆయన చేసిన సూచనలు చూస్తే మరీ సిల్లీగా ఉన్నాయి.
అగ్ర రాజ్యానికి అధినేతగా ఉండి కూడా మతిలేని వ్యాఖ్యలు చేయడం ఆయనకే చెల్లింది. శరీరంలోకి క్రిమిసంహారక మందులను ఇంజెక్ట్ చేయడం ద్వారా కరోనావైరస్ చికిత్స చేయవచ్చా అనే దానిపై పరిశోధన చేయాలని ఆయన సూచనలు చేసారు. క్రిమిసంహారక మందు ఇంజెక్షన్ ద్వారా శుభ్రపరచడం ద్వారా మనం ఏదైనా చేయగలమా…? ఎందుకంటే కరోనా వైరస్ ఊపిరితిత్తులను నష్టపరుస్తోంది కాబట్టి,
ఊపిరితిత్తుల్లో క్రిమిసంహారక మందులను ఇంజెక్ట్ చేయడం వైపు వైద్యులు ఆలోచించాలని, అది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది అంటూ డాక్టర్/సైంటిస్ట్ అయిన ట్రంప్ చెప్పారు. ఆయన సిల్లీగా తీసుకుని దాన్ని ఒక జోక్ గా చూడటం వలనే కరోనా తీవ్రత ఈ స్థాయిలో అమెరికాలో ఉందని ఇలాంటి వ్యక్తిని నమ్ముకుని అమెరికా నష్టపోయిందని దయచేసి వచ్చే ఎన్నికల్లో అమెరికన్లు ఓడించండి అంటూ సలహా ఇస్తున్నారు పలువురు.