కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో అమెరికన్లకు ప్రాధాన్యతనిచ్చే లక్ష్యంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ ని ముందు అమెరికన్లకు మాత్రమే ఇవ్వాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు సంతకాలు చేసారు. “అమెరికన్ పౌరులకు ముందు టీకాలు ఇవ్వాలని కంపెనీలు నిర్ణయం తీసుకోవాలి” అని ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసారు.
ఫిబ్రవరి చివరి నాటికి 100 మిలియన్ల ప్రజలు మరియు జూన్ నాటికి మొత్తం దేశంలో ఉన్న అందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక అమెరికా నూతన అధ్యక్షుడిగా బిడెన్ జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫైజర్‌కు త్వరలో అమెరికాలో అత్యవసర అనుమతి లభిస్తుందనే వ్యాఖ్యల నేపధ్యంలో ట్రంప్ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. యుఎస్ సంస్థ మోడెర్నా టీకాపై కూడా అంచనాలు ఉన్నాయి.