నేడు భారత్ బయోటెక్ ను 80 దేశాలకు చెందిన రాయబారులు, హై కమిషనర్లు సందర్శించనున్నారు. కోవిడ్ మీద పరిశోధనలను విదేశీయులకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో వారిని మన విదేశాంగ శాఖ ఆహ్వానించింది. ఉదయం పదింటికి హైదరాబాద్ చేరుకున్న విదేశీ ప్రతినిధుల బృందం. నేరుగా ఎయిర్ పోర్ట్ నుండి ఓఆర్ఆర్ మీదుగా భారత్ బయోటిక్ కు వెళ్లనుంది. భారత్ బయోటిక్ తయారు చేస్తోన్న కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌లో ఉంది.
వ్యాక్సిన్‌కు అనుమతి కోరుతూ ఇప్పటికే భారత్ బయోటెక్ డీసీజీఐ అనుమతి కోరింది. నిపుణుల కమిటీ పరిశీలించి టీకా పనితీరు, పంపిణీ వంటి అంశాలపై చర్చలు జరుపనుంది. ఈ కమిటీ రిపోర్టు అందించిన రెండు వారాల్లోగా టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. కొద్దివారాల్లోనే దేశంలో కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తుందని ఇటీవల అఖిలపక్ష సమవేశంలో ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.