Donald Trump: తనపై జరిగిన దాడిపై ట్రంప్ సంచలన ప్రకటన

-

Donald Trump: తనపై జరిగిన దాడిపై ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ర్యాలీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన ట్రంప్‌ని ఆస్పత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్‌ చెవికి గాయమైంది. గాయపడిన అనంతరం ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేశారు. కాగా, ఆయనపై కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.

Donald Trump whisked off stage at rally in Pennsylvania after loud noises ring through crowd

అయితే తనపై హత్యాయత్నం తర్వాత… అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో శబ్దంతో ఏదో చెవిపై దూసుకుపోయినట్లు అర్థమైందని ఆయన వివరించారు. రక్తస్రావం జరగడంతో ఆ తర్వాత ఏమైందో గ్రహించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో వెంటనే అప్రమత్తమై మోకాళ్లపై కూర్చున్నట్లు వెల్లడించారు. దేశంలో ఇలాంటి సంఘటన జరగడం నమ్మశక్యంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version