ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. 7 సీజన్ల తర్వాత దిల్లీ క్యాపిటల్స్ రికీ పాంటింగ్‌ను వదులుకుంటుందని.. పాంటింగ్‌తో జర్నీ అద్భుతం థాంక్యూ కోచ్ అంటూ ఎక్స్ లో పోస్టు పెట్టింది.
2018లో రికీపాంటింగ్ దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో చేరాడు. అప్పట్నుంచి దిల్లీకి హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన పాంటింగ్ 2024 ఐపీఎల్ దాకా ఆ పదవిలో కొనసాగాడు. ఈ 7సీజన్లలో దిల్లీని ఛాంపియన్‌గా నిలపడంలో పాంటింగ్ విఫలమయ్యాడు. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి సీజన్లోనే జట్టు ఆఖరి స్థానంలో నిలవగా, 2019లో ప్లేఆఫ్స్, 2020లో ఫైనల్‌కు, ఆ తర్వాత 2021లో ప్లేఆఫ్స్‌కు చేరిన దిల్లీ, 2022, 2023, 2024 సీజన్లలో టాప్-4లో నిలవలేకపోయింది. ప్రస్తుతం దిల్లీకి డైరెక్టర్‌గా ఉన్న సౌరభ్ గంగూలీ హెడ్ కోచ్ పదవి దక్కే ఛాన్స్ ఉంది. కొత్త కోచ్ గురించి త్వరలోనే ప్రకటన రావచ్చు.