మన శరీర ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచాలన్న, సరైన శారీరక విధులను నిర్వహించాలన్న గాని హార్మోన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనందరికీ ఈ హార్మోన్ల గురించి బాగా తెలుసు. ముఖ్యంగా హార్మోన్ లలో ఇన్సులిన్, ఈస్ట్రోజెన్, డోపామైన్, SHS, TSH హార్మన్లు ఉంటాయి. ఇవి శరీరంలో సహజ రసాయనాలుగా పనిచేస్తాయి. ఈ హార్మన్లు ఒక్కొక్కటి ఒక్కొక విధిని నిర్వహిస్తాయి. జుట్టు పెరుగుదల, మానసిక స్థితి, శరీర బరువు, సంతానోత్పత్తి స్థాయి, శక్తి అలాగే ఉద్రిక్తతకు ఇవి ముఖ్యమైన అంశాలు. మనలో ఎండోక్రైన్ వ్యవస్థ హార్మోన్ల సరఫరాను నియంత్రించడానికి ఇది పనిచేస్తుంది. ఈ హార్మోన్ వ్యవస్థలో ఎటువంటి హెచ్చు తగ్గులు ఉన్నాగాని అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే హార్మోన్లలో హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలంటే కొన్ని సహజ పద్ధతులు పాటించడం మంచిది. అవేంటో తెలుసుకుందాం..!
మీరు సరిగ్గా తింటే అది మీ శరీరంపై ప్రభావం చూపుతుంది. మీరు సరిగ్గా తినకపోతే మీ ఎండోక్రైన్ గ్రంధులకు నష్టం కలిగించే మొదటి సంకేతం. మీ ఆహారంలో సరైన పోషకాలను చేర్చడం వల్ల మీ హార్మోన్లు సమతుల్యతలో ఉంటాయి. ఇందుకోసం మీరు మీ ఆహారం నుండి అధిక మొత్తంలో ప్రోటీన్, అధిక ఫైబర్ ఆహారాలు, తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక చక్కెరను తినడం మానెయ్యాలి. అలాగే చాలామంది బరువు నిర్వహణలో అవగాహనా లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వలన హార్మోన్ల మార్పులకు దారితీస్తాయి. అతిగా తినడం లేదా తక్కువగా తినడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు, జీవక్రియ లోపాలు పెరుగుతాయి. కాబట్టి సరైన కేలరీల సమతుల్యతను కలిగి ఉండటం మంచిది. అంతేకాకుండా క్రమం తప్పకుండ వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సరైన హార్మోన్ల సమతుల్యతను అందిస్తుంది.
రెగ్యులర్ వ్యాయామం పెరిగిన కొవ్వును కరిగించడానికి, యాంటీ ఇన్ఫ్లమేటరీ హార్మోన్ల ఉత్పత్తిని పెంచడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే తగినంత నిద్ర లేకపోవడం హార్మోన్లను దెబ్బతీస్తుంది. ఎటువంటి పరిమితులు లేకుండా పూర్తి నిద్ర మనిషికి చాలా అవసరం. మీకు గాఢంగా నిద్ర రాకపోతే మీ శారీరక ఆరోగ్యంతో సమస్యలు ఉండవచ్చు. అందుకని చక్కని నిద్ర అనేది మానవునికి చాలా అవసరం. మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని మూలికలు, మొక్కలు మీకు అవసరం. ఈ మూలికలు ఒత్తిడిని ఎదుర్కోవటానికి అలాగే హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. అశ్వగంధ, పసుపు, తులసి, జిన్సెంగ్, లైకోరైస్ కొన్ని మూలికలను మీ ఇంటిలో పెంచడం వల్ల ఎప్పటికప్పుడు మీ శారీరక ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు.