కరోనా వలన ఈ ఏడాది టీ సర్కార్ కి ఎంత బడ్జెట్ లాస్ అంటే ?

-

ఈరోజు తెలంగాణా సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా కరోనా ప్రభావం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్ని రకాలుగా మొత్తం రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. ఆదాయంగా భారీగా తగ్గిన నేపథ్యంలో 2020-21 బడ్జెట్ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని ప్రభుత్వానికి ఆర్థిక శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి 39,608 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

 

2020-21 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు రూ.33,704 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. అంతే కాక రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,727 కోట్లను పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. దీని ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద రూ. 8,363 కోట్లు రావాలి. కానీ రూ.6,339 కోట్లు మాత్రమే ఇచ్చారు. మొత్తంగా రూ.52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ఆర్థిక నిర్వహణ ప్లానింగ్ రెడీ చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version