టీఎస్‌ ఎంసెట్‌–2021 మళ్లీ వాయిదా!

-

గత ఏడాది నుంచి కరోనా ఎఫెక్ట్‌ విద్యారంగంపై ఎక్కువగా పడుతూనే ఉంది. అందుకే కేవలం రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షలు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ఎంసెట్‌ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. ఆ వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా టీఎస్‌ ఎంసెట్‌ జూలై 5 – 9 వ తేదీ వరకు జరగాల్సి ఉండగా, విజృంభిస్తోన్న కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా వాయిదా పడింది. ఇంటర్‌ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే, ఇంటర్‌ సెకండియర్‌ పరీక్ష తేదీలను ప్రకటించిన అనంతరం ఎంసెట్‌ పరీక్ష తేదీలను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఎంసెట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ ఇంటర్‌ పరీక్షల కంటే ముందుగా నిర్వహించడం సరికాదన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఎగ్జామ్‌ ప్రవేశ పరీక్ష కోసం ఇప్పటివరకు దాదాపు 1,37,554 మంది అప్లై చేసుకోగా.. మెడికల్‌ పరీక్ష కోసం 67,548 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ నమోదు కూడా వాయిదా పడింది. పూర్తి స్థాయిలో రెండో డోస్‌ కూడా అందలేదు. దేశవ్యాప్తంగా కేవలం నాలుగు శాతం మంది జనాభాకే పూర్తి డోస్‌ టీకా అందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తేలింది. ఇంకా అందరికీ పూర్థి స్థాయిలో టీకా అందే వరకు ఈ ఏడాది చివరి వరకు సమయం పడుతుంది. మరోవైపు బ్లాక్, వైట్‌ ఫంగస్‌లు కూడా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో అందుకే ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నారు.

విద్యార్థులు జూన్‌ 3 వరకు ఎంసెట్‌ ఎగ్జామ్‌ కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.. తదుపరి వివరాల కోసం విద్యార్థులు తెలంగాణ ఎంసెట్‌ 2021 అధికారిక వెబ్‌ సైట్‌ https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET చూడాలని తెలిపారు. త్వరలో మరో కొత్త పరీక్ష తేదీని విడుదల చేస్తామని పాపిరెడ్డి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version