నేడే కేబినెట్ మీటింగ్‌.. లాక్‌డౌన్ పొడ‌గింపున‌కే స‌ర్కార్ మొగ్గు

-

తెలంగాణ‌లో రేప‌టితో లాక్‌డౌన్ ముగుస్తుంది. రాష్ట్రంలో క‌రోనా తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో ప్ర‌భుత్వం మే 31వ‌ర‌కు లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట విధించిన లాక్‌డౌన్ మే 21తో ముగియ‌గా.. మ‌ళ్లీ నెలాఖ‌రు వ‌ర‌కు పొడ‌గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కాగా ఇప్పుడు మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడ‌గిస్తారా లేదా అని రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు.

ఈ లాక్‌డౌన్ కాలంలో కేసులు ఏమైనా తగ్గాయా క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితులు ఎలా ఉన్న‌య‌నే విష‌యంపై నేడు మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు సీఎం కేసీఆర్‌. లాక్‌డౌన్ వ‌ల్ల ఎదుర‌వుతున్న ఇబ్బందుల గురించి కూడా చ‌ర్చిస్తారు.

అయితే రాష్ట్రంలో కేసులు పెద్ద‌గా త‌గ్గ‌ట్లేద‌నే చెప్పాలి. ఇదే విష‌యంపై ఇప్ప‌టికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను సీఎం స్ప‌ష్టత కోర‌గా.. వారు కూడా లాక్‌డౌన్ పొడ‌గించాల‌నే చెప్పిన‌ట్ట స‌మ‌చారాం. ఇంకో వైపు కేంద్రం కూడా జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు క‌రోనా నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని అన్ని రాష్ట్రాల‌కు సూచించింది. మ‌న రాష్ట్ర హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రావు కూడా జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు కేసులు త‌గ్గుతాయ‌ని చెబుతున్నారు. వీట‌న్నింటినీ ప‌రిశీలిస్తే లాక్‌డౌన్ పొడ‌గించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్టుతెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version