వైఎస్సార్‌సీపీ గుర్తింపు రద్దు కేసులో నోటీసులు జారీ చేసిన హైకోర్టు..!

-

వైఎస్సార్‌సీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌లో ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్, వైఎస్సార్‌సీపీకి నోటీసులు ఇచ్చింది. సెప్టెంబర్ 3లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సూచించిన కోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ 3 కు వాయిదా వేసింది. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఉపయోగించే హక్కు తమకే ఉందంటూ అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఇదిలా ఉంటే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుపై అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే. పార్టీ తరఫున షోకాజ్ నోటీసు పంపిన జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని ఘాటుగా విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version