తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలలు అందించే రెండు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.PEd) మరియు రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (D.PEd) కోర్సులలో ప్రవేశానికి 2023-24 విద్యా సంవత్సరానికి నిర్వహించే తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2023 (TS PECET-2023) తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో.. రెండు సంవత్సరాల బీపీఈడీ, డిపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ పీఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యా శాఖ ఈ రోజు విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి మే 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 500, మిగతా కేటగిరిల వారికి రూ. 900గా ఫీజు నిర్ణయించారు. ఆలస్యం రుసుం రూ. 500తో మే 15 వరకు, రూ. 2000తో మే 20 వరకు, ఆలస్య రుసుం రూ. 5 వేలతో మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 26 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. జూన్ మూడో వారంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. తదితర వివరాల కోసం www.pecet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.