మరో 833 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్

-

ఇంజినీరింగ్ చదవి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. టీఎస్పీఎస్సీ మరో ఉద్యోగ ప్రకటనతో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల వరుస నోటిఫికేషన్లతో అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. తాజాగా మరో ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.

tspsc

వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటనను జారీ చేసింది. అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈనెల 29 నుంచి అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ సందర్శించాలని సూచించింది.

కాగా, ఇటీవల మున్సిపల్ శాఖలో 175 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ పోస్టులకు, రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version