ఆర్టీసీ ఛార్జీల పెంపు పై TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. రెండు నెల క్రితం ఆర్టీసీ చార్జీలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని… ఈ నేపథ్యంలోనే… చార్జీల పెంపు పై ఇవాళ రవాణా మంత్రి అజయ్, ఎండి సజ్జనార్ సమావేశమయ్యామని స్పష్టం చేశారు. ప్రజలం దరికీ ఆమోదయోగ్యమైన ఛార్జిలను పెంచుతామని పేర్కొన్నారు.
చార్జీల పెంపు ప్రతిపాదన పెండింగ్ లో ఉందని.. దానిపై చర్చించామని స్పష్టం చేశారు TSRTC చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక అందిస్తాం.. ఛార్జీల పెంపు నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని వెల్లడించారు. కాగా.. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్ కు 25 పైసలు మరియు ఎక్స్ ప్రెస్ లు ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే…. సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు మరియు మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.