రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. రాష్ట్రంలోని 18.35 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఈ మేరకు ప్రకటన చేశారు. యూనిట్ విద్యుత్ ను రూ.4.46 లకు కొని రైతులకు ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు.

త్వరలోనే సోలార్ విద్యుత్ ను ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దాని కోసం పది వేల మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిని టెండర్ల ద్వారా రూ.2.49 లకు కొంటున్నట్టు శ్రీకాంత్ స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యుత్ చార్జీల పెంపు పై కూడా ఆయన స్పందించారు. విద్యుత్ చార్జీలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు అని పెరుగుతాయి తగ్గుతాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ రేట్లలో ప్రతి గంటకు మార్పులు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచడం పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version