ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ప్రతిష్ఠంభనకు తెరదించడంతో.. 55రోజుల తర్వాత మళ్లీ స్టీరింగ్ పట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో తెల్లవారు జాము నుంచే కార్మికులు ఉత్సాహంగా విధుల్లోకి చేరుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల నుంచి బస్సులు బయటికి వచ్చి రోడ్డెక్కాయి. మరోవైపు.. ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంస్థను వృద్ధిలోకి తీసుకొస్తామని కార్మికులు పేర్కొన్నారు.
తెలంగాణ
అమరులైన కార్మిక కుటుంబ సభ్యులకు పరిహారం అందించడంతో పాటు వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పడం పట్ల కేసీఆర్‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అమరులైన వారికి ఎం చేసినా తమతో కలిసి ఉండాల్సిన వారు ఇవాళ భౌతికంగా లేకపోవడం పట్ల కార్మికుల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.