ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. బస్సుల ఛార్జీలను తగ్గించిన TSRTC

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ శుభవార్త అందించింది. టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రారంభ ఆఫర్ కింద ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గించినట్లు తెలిపారు. అయితే, ఈ ఆఫర్ నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. నెల రోజుల పాటు ఈ గరుడ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు.

మియాపూర్ నుండి విజయవాడకు బస్సు ఛార్జీని రూ.830గా నిర్ణయించారు. ఈ ధరను ఇప్పుడు రూ.760కి తగ్గించారు. ఎంజీబీఎస్ నుండి విజయవాడకు రూ.780గా ఉన్న టిక్కెట్ ధరను రూ.720కి తగ్గించారు. నిన్న పది ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సులను ప్రారంభించారు. మంగళవారం హైదరాబాద్‌ మియాపూర్‌లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే. దశలవారీగా ఈ ఏడాది చివరి నాటికి 50 బస్సులను ప్రారంభించనుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version