ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరదు: సునీల్ శర్మ

-

ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాల జేఏసీ వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి సోమవారం కీలక ప్రకటన చేశారు. ఈ క్ర‌మంలోనే సమ్మె విరమించినా కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదని స్పష్టం చేసింది. సమ్మె విరమిస్తున్నట్టు జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అన్నారు. ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరదని స్పష్టం చేశారు. సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని అన్నారు. ఓవైపు పోరాటం అంటూనే మరోవైపు విధుల్లో చేరతామంటున్నారని ఆరోపించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులు సమ్మెకు దిగారని, అనాలోచిత సమ్మెతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించారని సునీల్ శర్మ వ్యాఖ్యానించారు. కార్మికశాఖ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని, లేబర్ కోర్టు ఆదేశాలు వచ్చేవరకు సంయమనంతో ఉండాలని పేర్కొన్నారు. యూనియన్ల మాట విని కార్మికులు నష్టపోయారని, ఇకపై యూనియన్ల మాట విని మరిన్ని కష్టాలు తెచ్చుకోవద్దని హితవు పలికారు. డిపోల వద్ద శాంతిభద్రతల సమస్యలు సృష్టించవద్దని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version