హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. ఎల్లుండి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

-

హైదరాబాద్లో సెప్టెంబర్ 28వ తేదీన వినాయక విగ్రహాల నిమజ్జనం కన్నుల పండువగా జరగనుంది. నవ రాత్రుల పాటు అంగరంగ వైభవంగా పూజలందుకున్న వినాయక విగ్రహాలను భక్తులు..ఆట పాటలతో ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జన వేడుకలను చూసేందుకు హైదరాబాద్ తో పాటు..వివిధ జిల్లాల నుంచి తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.

ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. మొత్తం 535 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడపనుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేసి నిమజ్జనం, శోభాయత్ర సమయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా టీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ అన్ని చర్యలు తీసుకుంది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం రెతిఫైల్‌ బస్‌ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్‌ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version