స్కాం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగింది : గుడివాడ అమర్నాథ్‌

-

ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని వైసీపీ సర్కారు ఆరోపిస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ లో ఎలాంటి తప్పు జరగలేదని టీడీపీ చెబుతుండగా, ఇవిగో ఆధారాలు అంటూ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై మాట్లాడారు. ఫైబర్ నెట్ వ్యవహారంపై నేడు అసెంబ్లీలో చర్చ చేపట్టారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, నాడు టెండర్ దక్కించుకున్న టెరాసాఫ్ట్ సంస్థకు, ఈ కేసులో ఏ1 వేమూరి హరికృష్ణప్రసాద్ అనే వ్యక్తికి లింకులు ఉన్నాయని అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

మరోవైపు.. స్కిల్‌ స్కామ్‌లో రూ. 331 కోట్లు అక్రమాలు జరిగాయన్నారు గుడివాడ అమర్నాథ్.. ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్‌ సంస్థ తెలిపిందన్న ఆయన.. సీమెన్స్‌ ఉచితంగా అందించే కోర్సులను ఒప్పించి తెచ్చామని చంద్రబాబు బిల్డప్‌ ఇచ్చారు.. సీమెన్స్‌ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడి రాలేదన్నారు.. చంద్రబాబు అనుకూల వ్యక్తులకే ఫైబర్‌నెట్‌ టెండర్‌ కట్టబెట్టారు.. షెల్‌ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు.. హెరిటేజ్‌లో పనిచేసేవారే టెరాసాఫ్ట్‌లో డైరెక్టర్‌లుగా పనిచేశారు అంటూ అసెంబ్లీ వేదికగా ఆరోపణలు గుప్పించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక, అసెంబ్లీ వేదికగా మంత్రి గుడివాడ చేసిన వ్యాఖ్యల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version